– రెండేళ్లుగా నిధుల కొరతతో నిలిచిన సొరంగం పనులు.
– రేపు ఉప ముఖ్యమంత్రి ప్రాజెక్టు సందర్శన
నవతెలంగాణ – అచ్చంపేట
నల్గొండ జిల్లాకు సాగునీరు సాగునీరు అందించాలని ప్రధాన లక్ష్యంతో 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అచ్చంపేట మండలం మన్నె వారి పల్లి గ్రామ శివారులో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన జె పి ఆర్ కన్స్ట్రక్షన్ కు అనుమతులు ఇచ్చారు. రూ 2,292 కోట్లతో నిర్మాణం చేయడానికి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. 60 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని జెపిఆర్ కన్స్ట్రక్షన్ కు నివేదిక ఇచ్చారు. కానీ 15 ఏళ్లుగా ప్రాజెక్టు పూర్తి కావడం లేదు కానీ నిధుల కేటాయింపు పెంచుతున్నారు. రూ 4658 కోట్ల రూపాయలు అనుమతులు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు ఆరుసార్లు ప్రాజెక్టు ఖర్చులు పెంచారు. శ్రీశైలం ఎడమ గట్టు జలాశయం నుంచి మన్య వారి పల్లి వరకు 44 కిలోమీటర్లు సొరంగం పనులు తొవ్వవలసి ఉంది. సొరంగం తవ్వే టన్నల్ బోర్ మిషన్ సాంకేతిక కారణాలవల్ల ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. తల్ బోరింగ్ మిషన్, ముఖ్యమైన పరికరాలు పంపించడానికి కంపెనీ ప్రతినిధులతో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చించారు. సొరంగం తవ్వే టన్నల్ బోరింగ్ మిషన్ పరికరాలు వారం 10 రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని నీటిపారుదల శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ నెల 20వ తేదీన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రాజెక్టును సందర్శించనున్నారు.