కేసీఆర్‌ పాలనలో మరో ప్రాణం బలి

– వైఎస్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేసీఆర్‌ నియంత పాలనలో మరో నిండు ప్రాణం బలైపోయిందని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవు తున్న హోంగార్డు రవీందర్‌కు సకాలంలో జీతం రాకపోవ టంతో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. సకాలంలో జీతాలు ఇవ్వాలన్న సోయి కేసీఆర్‌ ప్రభుత్వానికి లేకపోవటం బాధాకరమని పేర్కొన్నారు.