ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరోలారీ 

Another lorry hit a stationary lorry ప్రమాదంలో గాయపడిన లారీ డ్రైవర్
– చికిత్స పొందుతూ మృతి
నవతెలంగాణ – అబ్దుల్లాపూర్ మెట్ 
ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ప్రమాదానికి గురైనా లారీ డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా, చండూర్ మండలం, నెర్మెట గ్రామానికి చెందిన రాంబాబు మట్టంపల్లి లోని ఎన్ సీ ఎల్ కంపెనీలో సిమెంట్ లోడ్ తో హైదరాబాద్ కు వస్తుండగా.. అబ్దుల్లాపూర్ మెట్ మండలం, బాటసింగారం పరిధిలో మౌంట్ ఓపెరా సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీ  ( ఏపీ 05టి ఎం 5658 )ని తను సిమెంట్ లోడ్ తో వస్తున్న లారీతో బలంగా  ఢీ కొట్టారు. దీంతో లారీ డ్రైవర్ రాంబాబుకు తీవ్ర గాయాలు కాగా.. రెండు కాళ్ళు విరిగిపోయాయి. చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం  మృతి చెందారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.