తన తొలి చిత్రం ‘హీరో’తో ఆకట్టుకున్న సూపర్ స్టార్ కష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన రెండవ సినిమాను ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో చేస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. మేకర్స్ బుధవారం సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయటంతోపాటు టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘దేవకీ నందన వాసుదేవ’ అనే టైటిల్ పెట్టారు. కథానాయకుడి పాత్రతో పాటు సినిమా ప్రిమైజ్ కూడా పరిచయం చేసేలా టీజర్ ఉంది. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అశోక్ గల్లా మాట్లాడుతూ,’టీజర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో పెద్ద సినిమాలకు మాటలు రాసిన సాయి మాధవ్ మా సినిమాకి పని చేయడం విశేషం. మూడు నాలుగు సినిమాల తర్వాత ఇంత మాస్ సినిమా చేయాలని అనుకున్నాను. కానీ బాల నన్ను ఇలా ప్రజెంట్ చేసే అవకాశం ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని భావిస్తున్నాను. ప్రశాంత్ వర్మ అద్భుతమైన కథ ఇచ్చారు. మానస చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమా నుంచి రాబోతున్న మిగతా కంటెంట్ కూడా మిమ్మల్ని అలరిస్తుంది’ అని తెలిపారు. ‘అర్జున్ ఈ కథ చెప్పినప్పుడు అద్భుతంగా అనిపించింది. ఇది నా మొదటి సినిమా. అందరూ చాలా సపోర్ట్ చేశారు’ అని నాయిక మానస వారణాసి చెప్పారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ,’నిర్మాత బాలకష్ణకి, నన్ను నమ్మి ఫ్రీడమ్‌తో పాటు ఈ కథ ఇచ్చిన ప్రశాంత్ వర్మకి థ్యాంక్స్. అందరూ అవుట్ పుట్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు, బీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ పెద్ద హిట్ అవుతుంది. ఇది చాలా కొత్త సినిమా. అన్ని కమర్షియల్ విలువలు ఉండే సినిమా. ‘మురారి’ తరహ సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. నిర్మాత సోమినేని బాలకష్ణ మాట్లాడుతూ, ‘నా కుటుంబం, ప్రశాంత్ వర్మ, అశోక్ సపోర్ట్ ఉండబట్టే ఈ చిత్రాన్ని ఇంత భారీ బడ్జెట్‌తో తీయగలిగాను. ఇది విజువల్ వండర్‌గా ఉంటుంది. ఈ సినిమా విజయం సాధించి మంచి డబ్బులు వస్తే ఆ డబ్బులని మళ్ళీ సినిమా పరిశ్రమలోనే పెడతాను. సినిమా అంటే నాకు అంత ఇష్టం’ అని చెప్పారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులతోపాటు దర్శకుడు ప్రశాంత్ వర్మ, రచయిత సాయిమాధవ్ బుర్రా పాల్గొన్నారు.