ప్రభాకరాచార్యులు కు మరో జాతీయ అవార్డు 

నవతెలంగాణ – అశ్వారావుపేట
విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ సేవా ట్రస్ట్ వారు అందించే విశ్వకర్మ లెజెండరీ జాతీయ పురస్కారానికి అశ్వారావుపేట కు చెందిన ప్రముఖ సాహితీవేత్త సి.నా.రె అవార్డు గ్రహీత,సాహిత్య రత్న సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు ఎంపిక అయ్యారు. సాహిత్యరంగంలో విశేష సేవలను అందిస్తున్నందుకు గౌరవ సూచికగా ఈ అవార్డును అందిస్తున్నామని సెప్టెంబరు 10 వ తేదీ ఆదివారం విజయవాడలో చిట్టి నగర్ లో జరుగు ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును అందుకోవాలని కోరుతూ సేవ ట్రస్ట్ సభ్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ మాచవరం గౌరీ శంకరాచార్యులు, బ్రహ్మశ్రీ డాక్టర్ యస్.బాలబ్రహ్మాచారి లు వాట్సాప్ ద్వారా ఆహ్వానం పంపారు. ఇప్పటికే ఎన్నో జాతీయ,అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్న ప్రభాకరాచార్యులు కు మరో పురస్కారం లభించడం పట్ల పలువురు సాహితీవేత్తలు,ఉపాధ్యాయులు,సి.ఆర్.పిలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.