ఓటింగ్ నిర్వహించే రోజు అధర్ పోలింగ్ ఆఫీసర్ ఎంతో ప్రాముఖ్యం

– అందరి సహకారంతో పార్లమెంట్ ఎలక్షన్ పూర్తి చేయాలి

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
ఓటింగ్ నిర్వహించే రోజు అదర్ పోలింగ్ ఆఫీసర్ ఎంతో ప్రాముఖ్యమని అందరి సహకారంతో పార్లమెంటు ఎలక్షన్ పూర్తిచేయాలని తహసీల్దార్ కిరణ్మయి  ట్రైనింగ్ ఆఫీసర్ రాములు అన్నారు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆధర్ పోలింగ్ ఆఫీసర్లతో పార్లమెంటు ఎలక్షన్ ఓటింగ్ ఏ విధంగా నిర్వహించాలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టెండర్ వోట్, చాలెంజ్ వోట్, ప్రాక్సి వోట్, టెస్ట్ వోట్ తదితర అంశాల పైన అవగాహన కల్పించారు. పార్లమెంటు ఎన్నికల్లో అధర్ పోలింగ్ అధికారులంతా దేశం కోసం పనిచేయాలని అన్నారు. ఓటింగ్ కంపార్ట్మెంట్కు అధికారులు ఎవరు వెళ్ళరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధర్ పోలింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.