ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలతోపాటు జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ‘సూరరై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా). అలాగే ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లోనూ ఈ సినిమా జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. సూర్య హీరోగా సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
లేటెస్ట్‌గా సూర్య 43వ చిత్రం కోసం ఈ క్రేజీ కాంబో మరోసారి కలసి పని చేయనుండటం ఓ విశేషమైతే, ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న జి.వి.ప్రకాష్‌కి సంగీత దర్శకుడిగా ఇది100వ చిత్రం కావడం మరో విశేషం. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషించనున్నారు. సూర్య, దుల్కర్ ఇద్దరూ అద్భుతమైన పెర్ఫార్మర్స్. ఈ ఇద్దరినీ తెరపై చూడటం వారి వారి అభిమానులకు, ప్రేక్షకులకు ఫీస్ట్‌లా ఉండబోతుంది. అలాగే నజ్రియా ఫహద్, విజరు వర్మ కూడా స్టార్ కాస్ట్‌లో భాగం కానున్నారు. సూర్య సొంత నిర్మాణ సంస్థ, 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పై జ్యోతిక, సూర్య, రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్ దీన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.