– ఐదున్నర కేజీలఫై బ్రాయిడ్ గడ్డ తొలగింపు డా. హేమరాజ్ సింగ్
నవతెలంగాణ దుబ్బాక
దుబ్బాక వంద పడకల ఆసుపత్రిలో బుధవారం మరో అరుదైన ఆపరేషన్ చేసి వైద్యులు మహిళ కడుపులో ఉన్న ఫైబ్రాయిడ్ గడ్డను తొలగించామని డా.హేమరాజ్ సింగ్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మహిళ గత పది రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ, దుబ్బాక ఆసుపత్రి డాక్టర్ హేమ్రాజ్ సింగ్‌ను సంప్రదించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన సిబ్బంది ఫైబ్రాయిడ్ గడ్డగా గుర్తించారు. డాక్టర్ హేమ్రాజ్ సింగ్ ఆధ్వర్యంలో మహిళకు ఆపరేషన్ చేసి ఐదు కేజీల 400 గ్రాముల ఫైబ్రాయిడ్ గడ్డను తొలగించారు. మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ హేమ్రాజ్ సింగ్ తెలిపారు. అరుదైన ఆపరేషన్ చేసిన వైద్యులకు కుటుంబ సభ్యులు కతజ్ఞతలు తెలియజేశారు.