షారూఖ్ ఖాన్, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం ‘జవాన్’. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించి అభిమానులకు, ప్రేక్షకులకు మేకర్స్ ఇప్పటికే ఎన్నో సర్‌ప్రైజ్‌లను అందించారు. తాజాగా మరో సర్‌ప్రైజ్‌తో అలరించటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే జవాన్ ప్రివ్యూ సహా సాంగ్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం నుంచి ‘నాట్ రామయ్యా వస్తావయ్యా..’ అనే సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు. ఆ పాటకు సంబంధించిన సాంగ్ టీజర్‌ను సోషల్ మీడియా ద్వారా షారూఖ్ పోస్ట్ చేశారు.
‘ఇప్పటికే జవాన్ సినిమా నుంచి ‘దుమ్మే దులిపేలా..’ అనే పాటతో పాటు ‘ఛలోనా’ అనే రొమాంటిక్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రెండు పాటలకు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో పాటగా ‘నాట్ రామయ్యా వస్తావయ్యా..’ను రిలీజ్ చేస్తున్నారు. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరుగుతున్నాయి. సాంగ్ టీజర్‌ను గమనిస్తే, సాంగ్ ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తోంది. రాబోతున్న ‘నాట్ రామయ్యా వస్తావయ్య..’ సాంగ్‌తో ఆడియెన్స్‌కి ఓ మ్యూజికల్ ఎక్స్‌పీరియెన్స్ కలుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు. షారూఖ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌరవ్ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాత. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.