బెంగళూరు: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత మహిళల జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-1గోల్స్ తేడాతో విజయం సాధించింది. నవ్‌నీత్ కౌర్, దీపిక ఒక్కో గోల్ కొట్టాగా.. జపాన్ తరఫున ఏకైక గోల్‌ను కనాఉటారా చేసింది. మరో మ్యాచ్‌లో కొరియా జట్టు 3-0తో థారులాండ్‌ను, చైనా జట్టు 4-0తో మలేషియాను చిత్తుచేశాయి.