మండలంలోని ఆన్సాన్ పల్లి గ్రామ అఖిల భారత యాదవ మహాసభ నూతన కమిటీని శనివారం నియామకం చేసినట్లుగా కాటారం డివిజన్ అధ్యక్షుడు ఆత్మకూరి స్వామి యాదవ్ తెలిపారు. అధ్యక్షుడుగా నానువాల కుమార్ యాదవ్,ఉపాధ్యక్షుడుగా ముత్యాల రాజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా జంగ రవితేజ యాదవ్,కార్యదర్శిగా కోడారి కొమురయ్య యాదవ్,కోశాధికారిగా ముత్యాల రాంబాబు యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రానున్న సర్వత్రా ఎన్నికల్లో యాదవులు ఐక్యాత చాటి,యాదవుల నుంచి ప్రజాప్రతినిధులుగా గెలుపొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి బోయిని రాజయ్య యాదవ్, మండల గౌరవ అధ్యక్షుడుగా యాధండ్ల రామన్న యాదవ్, డివిజన్ సహాయ కార్యదర్శి కోడారి చిన మల్లయ్య యాదవ్, అప్పల భూమేస్ యాదవ్,మొగిలి రాజ్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.