
మండలంలోని దాస్ నగర్ శాఖ పరిధిలో సీతారామయ్య కు పూలమాలతో నివాళులు సీపీఐ(ఎం) మండల శాఖ ఆధ్వర్యంలో అర్పించారు. ఈ సందర్భంగా మండల సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండ గంగాధర్ మాట్లాడుతూ సీతారామయ్య మృతికి సీపీఐ(ఎం) పార్టీకి తీరనిలోటు ఆయన జననం 1952 సంవత్సరంలో జన్మించారు. చిన్న వయసులోనే విద్యార్థి నాయకుడిగా ఎదిగి రాజకీయాన్ని అర్థం చేసుకొని సమాజ సేవలో నడిపిన జాతీయ కార్యదర్శిగా ఎదిగి ఢిల్లీలో స్థిరపడి రాజకీయం అందరికీ అర్థమయ్యే విధాల సేవ చేశారన్నారు. ఏమాత్రం అనకాకుండా పార్టీ ముందుకు తీసుకు పోయిన ఆయన లేకపోవడం తీరని లోటుగా భావిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి బండారి ఎల్లయ్య గంగాధర్లు నివాళులర్పించారు.