రాష్ట్రంలో టీడీపీకి పూర్వవైభవం

– పొలిట్‌బ్యూరో సభ్యులు నర్సింహ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు తమ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహ తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. టీడీపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి కట్ట వెంకటేష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. దీనికి రాష్ట్ర, జాతీయ నాయకులతో పాటు నర్సింహ హాజరై మాట్లాడారు. నాయకులు ఇంటింటికీ వెళ్లి పెద్దసంఖ్యలో సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామ భూపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జగదీష్‌రెడ్డి, వివిధ డివిజన్ల అధ్యక్షులు, పార్టీ సీనియర్‌ నాయకులు చిట్టిబాబు, స్వప్నచౌదరి, సరస్వతి, మోహన్‌రావు, నారాయణ, సాంబశివరావు, గౌతం, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.