నిజామాబాద్ కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు అంతరెడ్డి రాజరెడ్డి జిల్లా కేంద్ర గ్రంధలయ సంస్థ చైర్మెన్ గా నియమితులు అయినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రస్తుతం డిసిసిబి డైరెక్టర్ గా జిల్లా కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న అంతరెడ్డి రాజారెడ్డి బోదన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రధాన అనుచరుడు. అయన గత కొంత కాలంగా నామినేటేడ్ పోస్ట్ ను అశీస్తున్నారు. గతంలో నిజమాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు.నిజామాబాద్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం చైర్మెన్ గా డిసిసిబి డైరెక్టర్ గా పని చేశారు. ఇటివల పిసిసి చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమితులైన తరువాత జిల్లాలొ పదవుల పందేరం కోనసాగుతుంది. ఇటివల కేశ వేణుకు నుడా చైర్మెన్ గా నియమించే ప్రతిపాధనలు ఓకే చేసింది. అంతరెడ్డి రాజారెడ్డి గత కొంతకాలంగా డిసిసిబి పీఠంపై కన్నేశారు. మొన్నటి వరకు నుడా చైర్మెన్ రేసులో నిలిచారు. కాని అనుహ్యంగా రాజారెడ్డిని జిల్లా కేంద్రగ్రంధలయ సంస్థ చైర్మెన్ గా నియమించడం పార్టీలో కోత్త చర్చకు దారి తీసింది