కెనడాలో మోడీ ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు

Anti-Modi Govt Demonstrations in Canadaఒట్టావా : కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల ఎదుట మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిక్కులు ప్రదర్శనలు నిర్వహించారు. ఖలిస్థాన్‌ నేత హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల ప్రమేయం ఉండవచ్చునంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నాయి. తాజాగా టొరంటోలో వంద మంది సిక్కు నిరసనకారులు భారత జాతీయ పతాకాన్ని దగ్థం చేశారు. నరేంద్ర మోడీ కటౌట్‌ను బూటులో కొట్టారు. వాంకోవర్‌ కాన్సులేట్‌ కార్యాలయం ఎదుట కూడా 200 మంది ప్రదర్శన నిర్వహించారు.’మాకు పంజాబ్‌ లో రక్షణ లేదు. కెనడాలోనూ రక్షణ లేదు’ అని నినాదాలు చేశారు. ‘భారతదేశంలో వారు ఉగ్రవాదులు. వాంకోవర్‌లో మా సోదరుడిని చంపేశారు. అందుకే నిరసన తెలుపుతున్నా ం’ అని హర్పర్‌ గోసల్‌ అనే సిక్కు నిరసనకారుడు చెప్పాడు. కాగా ఒట్టావాలో కొద్ది మంది నిరసనకారులు భారత రాయబార కార్యాలయం ముందుకు చేరి ఖలిస్థాన్‌ అని రాసి ఉన్న పసుపు పతాకాలను ప్రదర్శించారు. కెనడాలో 7.7 లక్షల మంది సిక్కులు నివసిస్తున్నారు. స్వరాష్ట్రం పంజాబ్‌ తర్వాత సిక్కులు అత్యధికంగా నివసించేది ఇక్కడే.