కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పాలన సాగిస్తుందని ఆల్ ఇండియా కిసాన్ మహాసభ జిల్లా కార్యదర్శి చిలుక దేవిదాస్ అన్నారు. కేంద్రం తీరు వ్యతిరేకంగా దేశ వ్యాప్త నిరసనల్లో భాగంగా వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో కిసాన్ చౌక్ లో ఆందోళన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆన్ఇండియా కిసాన్ మహాసభ జిల్లా కార్యదర్శి చిలుక దేవిదాస్ మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తు వ్యతిరేక విదానాలను అవలంబిస్తుందన్నారు. మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తామని లిఖితపూర్వకంగా ఇచ్చి కూడా దాన్ని మళ్లీ అమలు చేసేల కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా కార్మిక, రైతు, ప్రజా సంఘాలు ముందుకు వచ్చి పోరాడాలన్నారు. కార్యక్రమంలో దేవేందర్, రాజు, సంగెపు బొర్రన్న, వెంకటనారాయణ నాయకులు ఉన్నారు.