నవతెలంగాణ – తాడ్వాయి
తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు మండల కేంద్రంలోని టెరిటోరియల్ విభాగం అటవీశాఖ కార్యాలయంలో ఎఫ్ఆర్ఓ కోట సత్తయ్య ఆధ్వర్యంలో మంగళవారం జయశంకర్ సార్ వేడుకలు నిర్వహించారు అనంతరం ఆంటీ ప్లాస్టిక్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టెరిటోరియల్ ఎఫ్ఆర్ఓ కోట సత్తయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాల వలన ప్రపంచంలోని ప్రజల ప్రాణాలు ముప్పులో ఉన్నాయన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి హానికరం మాత్రమే కాదు, వరదలకు కారణంగా మారనున్నాయని పలు నివేదికలు వెల్లడించారు. ప్లాస్టిక్ నిషేధించడం అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ శిక్షణ ఆఫీసర్లు బీట్ ఆఫీసర్లు బీస్ క్యాంపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.