నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
వైద్యుల సూచనల మేరకు యాంటిబైటిక్స్ మందులను వాడాలని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. శనివారం రిమ్స్ నుంచి ఇందిరా ప్రియదర్శి స్టేడియం వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. యాంటిబైటిక్ అతిగా వాడడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తు కలెక్టర్ చౌక్ మీదుగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు ర్యాలీ సాగింది. అక్కడి నుంచి తిరిగి రిమ్స్ కు చేరుకుంది. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. యాంటిబైటిక్ మందులు ఎక్కుగా వాడితే దాని పరిణమాలు తీవ్రంగా ఉంటాయన్నారు. వైద్యుల సూచనలు లేకుండా వాటిని వినియోగించొద్దని సూచించారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించేల తాము ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ప్రతి చిన్న జలుబుకు యాంటిబైటిక్ ను సొంత నిర్ణయం మేరకు తీసుకోవద్దని, వైద్యులను సంప్రదించిన తరువాతే డోసు ప్రకారం తీసుకోవాలన్నారు.