సీఎం పర్యటన నేపథ్యంలో భువనగిరిలో ముందస్తు అరెస్టులు..

నవ తెలంగాణ- భువనగిరి రూరల్ :
సీఎం కేసీఆర్ భువనగిరి పర్యటన నేపథ్యంలో బి ఎన్ తిమ్మాపురం భూ నిర్వాసితులను, త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోయిన రైతులను, ఈరోజు భువనగిరి బందుకు పిలుపునిచ్చిన శివసేన జిల్లా అధ్యక్షులు పూస శ్రీనివాసులు భువనగిరి పోలీసులు ముందస్తుగా  అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ అరెస్టులు  చేసినట్లు సమాచారం. అరెస్ట్ అయిన వారిలో   బియన్ తిమ్మాపురం భూ నిర్వాసితుల నాయకులు  వల్దాస్ రాజ్ కాళభైరవ, శివసేన జిల్లా అధ్యక్షులు పూస శ్రీనివాస్, బీసి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు తుమ్మేటి మహేష్, త్రిబుల్ ఆర్  బాధిత రైతుల నాయకులు ఆవుశెట్టి పాండు యాదవ్, బీజెపి నాయకులు ఈదులకంటి కరుణాకర్  లు ఉన్నారు.