డీడీఎన్ మండల అధ్యక్షునిగా అనుదీప్ శర్మ

నవతెలంగాణ – శాయంపేట
మండలంలోని పెద్దకోడపాక గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు తాటిపాముల అనుదీప్ శర్మను  దీప ధూప నివేదన అర్చక కమిటీ మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ధూప దీపా నివేదన రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ, రాష్ట్ర కార్యదర్శి తిరునగరి వెంకటాద్రి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మధు శర్మ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సిద్ధాంతి మటం గణేష్ కుమార్, పరకాల డివిజన్ అధ్యక్షులు కొలన్ పాక భాస్కర శాస్త్రి సమక్షంలో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా గూడ  వాసుదేవ మూర్తి, గౌరవ సలహాదారులుగా నటరాజ్ శర్మ, ప్రధాన కార్యదర్శిగా పానగంటి కోటేశ్వర్, కోశాధికారిగా గూడ  వెంకటరమణ శర్మ, ప్రచార కార్యదర్శిగా మార్త రాజ్ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.