‘ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, టైగర్ నాగేశ్వరరావు’ వంటి ప్రశంసలు పొందిన చిత్రాలతో సహా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ప్రముఖ ప్రాజెక్ట్‌లలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కొలాబిరేట్ అయ్యారు. ఈ సక్సెస్ ఫుల్ కొలాబిరేషన్‌ని కొనసాగిస్తూ అనుపమ్ ఖేర్ ‘ది ఇండియా హౌస్’లో ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, రామ్ వంశీ కష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి హీరో రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి వి మెగా పిక్చర్స్ ప్రొడక్షన్ పార్ట్నర్స్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హంపి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో ప్రారంభమైంది. ఈ షూటింగ్‌లో తాజాగా అనుపమ్ ఖేర్ జాయిన్ అయ్యారు. సాయి మంజ్రేకర్ కథానాయిక.