నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలి: అనూష

నవతెలంగాణ – వేములవాడ రూరల్ 
వేములవాడ రురల్ మండలం లోని మర్రిపల్లి, నాగయపల్లి గ్రామ రైతులు వానాకాల విత్తనం కొనుగోలు విషయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం పైన మర్రిపల్లి , నాగయ్య పల్లి గ్రామపంచాయతీల వద్ద రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారి చేని అనూష అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు అదికృత డీలర్ వద్ద మాత్రమే విత్తనాలు కొనుగొలుచేయాలని లూజ్ విత్తనాలు కొనుగోలు చేయకూడదు అని  రైతులకు సూచించారు.అలాగే విత్తన పంట కాలం  పూర్తి అయ్యేవరకు విత్తనాలు కొనుగోలు  రసీదును భద్రపరుచుకోవాలని అన్నారు.  ఆయిల్ ఫాం పంట సాగు చేయుటకు ప్రభుత్వం అందించే రాయితీల గురించి కూడా రైతులకు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో నాగాయిపల్లి  మాజీ సర్పంచ్ తంపుల  సుమన్ , రైతులు జాగీరు సురేష్, లక్కం తిరుపతి, తోట్ల  మహేష్ , మనుపటి  నర్సయ్య,తిరుపతి, పర్శరములు ,పండుగు రాజయ్య, జంగం చంద్రమౌళి ,చెట్టిపల్లి నరేశ్,గొడుగు దేవయ్య,సుంక మల్లేశం,గోపు మల్లేశం,  తో పాటుతదితరులు పాల్గొన్నారు.