అనుష్క, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఘాటి’. యువి క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా గురువారం మేకర్స్ అనుష్క విశ్వరూపాన్ని పరిచయం చేసేలా ఓ గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ఆదివాసీ ప్రజలు తమ వస్తువులన్నింటినీ తీసుకుని కొండపైకి నడుస్తుండతో గ్లింప్స్ మొదలవుతుంది, కార్లలో కొంతమంది వ్యక్తులు ఘాట్ రోడ్లపైకి వస్తారు. తన శరీరం అంతటా ట్రైబల్ టాటూస్‌తో, సిటీ బస్సు వైపు కొడవలితో నడుచుకుంటూ వచ్చిన అనుష్క ఎంట్రీ అదిరిపోయింది. అనుష్క బస్సులోకి ఎంటరై ఓ తలని నరికి అద్దంలో తనను తాను చూసుకోవడం టెర్రిఫిక్‌గా ఉంది. రక్తం చిందే ఆ తలని పట్టుకొని నడుస్తూ, ఆపై పొగ తాగుతున్నట్లు కనిపించిన విజువల్స్ అదిరిపోయాయి. గ్లింప్స్ లోని ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత ఇంటెన్స్ని యాడ్ చేసింది. ఈ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.