ఇప్పుడు మార్కెట్లో రకరకాల ఉప్పులు అందుబాట్లో ఉన్నాయి. ఆహార పదార్థాల రుచికి ఉప్పు ఎంతో ఉపకరిస్తుంది. మరి ఏ ఉప్పు మంచిదో? ఎందులో ఏయే పోషకాలు ఉన్నాయో ఎంతమందికి తెలుసు? వంటల్లో నిత్యం వాడే సాల్ట్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసుకుని పరిమిత మోతాదులో తీసుకుంటే వాటిలోని పోషకాలు ప్రయోజనకరంగా అందుకోవచ్చు.
ఉప్పు కేవలం రుచి కోసమే కాదు. అది మన ఆరోగ్యానికి అత్యవసరమే కాక ఎన్నో శారీరక విధులను నిర్వర్తించేందుకు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
సెల్టిక్ సాల్ట్: సెల్టిక్ సాల్ట్‌లో రెగ్యులర్ సాల్ట్‌తో పోలిస్తే సోడియం తక్కువగా ఉంటుంది. అయితే పింక్ సాల్ట్, కోషర్ సాల్ట్ కంటే సోడియం కొంచెం అధికంగా ఉంటుంది.
బ్లక్ సాల్ట్: బ్లాక్ సాల్ట్‌లో టేబుల్ సాల్ట్ కంటే సోడియం తక్కువగా ఉంటుంది. కడుపుబ్బరం, అజీర్తి, కడుపునొప్పి, వికారం, గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడేవారు బ్లాక్ సాల్ట్ వాడితే మేలు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, జింక్ వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి.
లో సోడియం సాల్ట్: ఈ వెరైటీ సాల్ట్‌లో సోడియం తక్కువగా, పొటాషియం అధికంగా ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు, ఉప్పు తక్కువగా తినాలనుకునే వారు ఈ సాల్ట్‌ను ట్రై చేయవచ్చు.
పింక్ సాల్ట్: పోషకాలు అధికంగా ఉండే పింక్ సాల్ట్ తరచూ తీసుకోవడం ద్వారా రక్త సరఫరా మెరుగవడంతో పాటు కండరాల నొప్పులను తగ్గే అవకాశం ఉంది. కణాల్లో పీహెచ్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది.
రెగ్యులర్ సాల్ట్: మనం దైనందిన జీవితంలో అధికంగా ఉపయోగించే వైట్ సాల్ట్‌లో అయోడిన్ అధికంగా ఉంటుంది. అయితే దీన్ని తక్కువ మోతాదులో తీసుకోవడం మేలు. ఈ సాల్ట్‌ను ఓ వ్యక్తి రోజుకు 5 గ్రాములకు మించి తీసుకోరాదు.
గళ్లుప్పు: పోషకాలు మెండుగా ఉండే గళ్లుప్పును కూడా ఇప్పుడు చాలామంది వినియోగిస్తున్నారు. అయితే ఈ సాల్ట్ నీటిలో అంత సులభంగా కరగదు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.