– నేటి నుండి గ్రామసభలు…
– డి ఆర్ డి ఏ,ఇన్చార్జి డిపిఓ శేషాద్రి
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
నేటి నుండి గ్రామాల్లో జరిగే గ్రామసభల్లో ఎవరైనా సరే అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని డి ఆర్ డి ఎ, ఇన్చార్జి డిపిఓ శేషాద్రి అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కొత్త పథకాలపై నేటి నుండి గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాల కోసం ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని లబ్ధిదారులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అంతేకాకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగేటప్పుడు అనర్హుల్గా ఎవరైనా ఉంటే ఈ గ్రామ సభలో తెలుపవచ్చు అన్నారు. అలాగే అభ్యంతరాలు కుండా ఏవైనా ఉంటే వాటిని కూడా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి నిరంతర ప్రక్రియ గా కొనసాగిస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిగిందన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు.ఆయన వెంట ఎంపీడీవో లక్ష్మీనారాయణ అన్నారు.