నవతెలంగాణ -పెద్దవూర
కృషి శ్రమను, అంకితభావాన్ని నమ్ముకున్న వారికీ సాధ్యం కానిది ఏదీ లేదు అని నిరూపించింది నిహారిక తాను చదువుకున్న పాఠశాలకు, తల్లిదండ్రులకు తన కలలను నిజం చేసుకుంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పులిచర్ల జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువు కుంటున్న నిహారిక అండర్- 14 కబడ్డీ విభాగం లో రాష్ట్ర స్తాయిలో నల్గొండజిల్లాలో జరిగిన జోనల్ స్థాయిలో టీలలో జిల్లా జట్టుకు ఎంపిక కావడం పట్ల ప్రధానోపాధయులు సుదర్శన్, పిఈలచ్చయ్య, సిఆర్ పిదుబ్బ పరమేష్ మరియు ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, తల్లిడండ్రి హర్షము వ్యక్తం చేశారు.