రైతు బీమా కోసం దరఖాస్తుల ఆహ్వానం: ఏఓ, ఏఈఓ

నవతెలంగాణ – మోపాల్
ఇంతవరకు బీమా చేసుకొని రైతులు, అలాగే కొత్తగా పట్ట మార్పిడి చేసుకున్న రైతులు,  రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని మోపాల్ మండల్ వ్యవసాయ అధికారి హీరా,  ఏఈఓ చక్రపాణి ఒక ప్రకటనలో కోరారు. దరఖాస్తు తో పాటు రైతు పట్టాదారు పాసుబుక్ లేదా తహసిల్దార్ డిజిటల్ సంతకం చేసిన డిఎస్ పేపర్, రైతు ఆధార్ కార్డు ,నామిని ఆధార్ కార్డు జతచేసి క్లస్టర్ ఏఈఓ లకు అందజేయాలన్నారు. దరఖాస్తులకు తుది గడువు ఆగస్టు 5 వరకు ఉందన్నారు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న రైతులు మాత్రమే రైతు బీమాకు అర్హులని అన్నారు.  గతంలో రైతు బీమా చేసుకున్న రైతులు బీమా లో మార్పులు చేర్పులు కోసం ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు.  ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి  హీరా, ఎఈవో చక్రపాణి మాట్లాడుతూ.. ఎటువంటి రుసుము లేకుండా రైతులకు ఐదు లక్షల రూపాయల బీమా ప్రభుత్వం కల్పిస్తుందని, ఇటువంటి సదవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలని వారు కోరారు.