పెస్టిసైడ్ డీలర్ షాపులను పరిశీలించిన ఏఓ

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని పేస్టి సైడ్ షాపులను మండల వ్యవసాయాధికారి బుదవారం పరిశీలించారు. ఈ సందర్భంగా షాపులలోని రైతువారి విత్తనాల అమ్మకాల రిజిస్టర్ లను పరిశీలించడం జరిగింది. తప్పని సరిగా షాపులలో రిజిస్టర్ లను నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షాప్ యజమానులు, సొసైటీ హెడ్ క్లర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.