వడగళ్ల వానకు నష్టపోయిన పంటలను పరిశీలిస్తున్న ఏఒ

నవతెలంగాణ – మాక్లూర్ 
మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన వడగళ్ళు లతో కూడిన రాళ్ల వర్షానికి దెబ్బ తిన్న వరి పంటను మండల వ్యవసాయాధికారి పద్మ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా బోర్గం(కే), మాక్లూర్ గ్రామాల్లో రాళ్ల వర్షనికి వరి ధాన్యం రాలిపోయిన పంటలను పరిశీలించారు. మండలంలో ఎంత వరకు వరి ధాన్యం రాలిపోయాయో అంచనా వేసి ఉన్నత అధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ విస్తరణ అధికారి రంజిత్, రైతులు పాల్గొన్నారు.