నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు: ఏఓ నాగేశ్వరరావు 

నవతెలంగాణ – డిండి
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని ఏఓ నాగేశ్వరరావు అన్నారు. గురువారం డిండి మండలం లోగల విత్తనాల డీలర్ల దుకాణాలను ఇన్స్పెక్షన్ చేశారు. ఈ సందర్భంగా డీలర్లు అందరూ పత్తి విత్తనాల ప్యాకెట్లను ఎమ్మార్పీ ధరలకు వికరించాలని, పత్తి విత్తనాలు కొన్న రైతులు యొక్క వివరాలు ఒక రికార్డులో నమోదు చేసి ఉంచవలసిందిగా డీలర్ల కు సూచించారు. రైతులందరూ ఆతరైజర్ డీలర్స్ వద్ద నే పత్తి విత్తనాలు కొనుగోలు చేసి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని, పంట కాలమంతా జాగ్రత్తగా ఉంచుకోవలసినదిగా కోరారు. రైతులు మధ్యవర్తులను దళారులు నమ్మి మోసపోవదన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్టు ప్రజల దృష్టికి వస్తే మండల వ్యవసాయ అధికారికి తెలియజేయవలసిందిగ ఆయన అన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.