ఏవో ఫలితాలు విడుదల

– టీఎస్‌పీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో వ్యవసాయ, సహకార శాఖలో అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ (ఏవో) పోస్టుల ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌ పీఎస్సీ) విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్‌ పీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 148 ఏవో పోస్టుల భర్తీ కి 2022, డిసెంబర్‌ 28న టీఎస్‌పీఎస్సీ నోటిఫికే షన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు 8,961 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తే,వారిలో పేపర్‌-1కు6,546 (73.04 శాతం) మంది,పేపర్‌-2కు 6,519 (72.74 శాతం) మంది హాజరయ్యారు. జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా (జీఆర్‌ఎల్‌)ను విడుదల చేశామని తెలిపారు. వివరాలు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచా మని, త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికై న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తామని తెలిపారు.
పలు పోస్టులకు ఫలితాలు విడుదల
మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ శాఖలో టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌కు సంబంధించి 175 పోస్టులకు జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా (జీఆర్‌ఎల్‌)ను టీఎస్‌ పీఎస్సీ విడుదల చేసింది. 18 డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు, 22 హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులకు, ఇంటర్‌ విద్యాశాఖలో, సాంకేతిక విద్యాశాఖలో లైబ్రరియన్‌ పోస్టులకు, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టులకు సంబంధించిన జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా (జీఆర్‌ఎల్‌)ను విడుదల చేశామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని వివరించారు.