నేడు హైదరాబాద్‌కు జగన్‌ కేసీఆర్‌ను పరామర్శించనున్న ఏపీ సీఎం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఇటీవల తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేసుకున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన పరామర్శించనున్నారు. ఉదయ తాడేపల్లి గూడెం నుంచి బయలు దేరి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌ చేరుకుంటారు.