నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆదివారం సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీకి చెందిన మంత్రి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య నేలకొన్న వివాదాలు, విభజన సమస్యలు తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించినట్టు సమాచారం.