ఆపద్బాంధవుడు..! ఆ అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ 

– గుండెపోటుతో మృతి.. అటవీ సంపదకు అపశృతి
– అడవి బిడ్డలకు అండగా.. గిరిజనులకు అపన్నహస్తం స్పూర్తి నింపిన కీర్తిశేషులు వజ్జ లక్ష్మీనర్సు
– శోకసముద్రంలో ఆదివాసి గ్రామాలు
నవతెలంగాణ – తాడ్వాయి 
అటవీ శాఖ సెక్షన్ అధికారి (ఎఫ్ ఎస్ ఓ) కీర్తిశేషులు వజ్జ లక్ష్మీనర్సు చిన్న తనం నుంచి పల్లె వాతావరణం లో పెరిగిన ఆయనకు గ్రామీణుల కష్టాలు బాగా తెలుసు. ఆయన 25 మార్చ్ 1964లో జన్మించారు. పేద ఆదివాసి కుటుంబంలో పుట్టి, ఉన్నత చదువులు చదివి, అటవీ శాఖలో 1991 అక్టోబర్ నెలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా మొట్టమొదట ఉద్యోగంలో చేరి బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుండి ఆయన అటవీ శాఖలో నిరంతరం విధులు నిర్వహిస్తూ, అటవీని సంరక్షిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఏజెన్సీలో అడవుల పెరుగుదలకు ఎంతో కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగా అటవీ శాఖలో ఆయన సేవలను గుర్తించి “ఫారెస్ట్ బీట్ ఫీసర్” నుండి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా 2005లో ప్రమోషన్ పొందారు. అనంతరం 2017లో ములుగు జిల్లా మంగపేట మండలంలోని నరసింహసాగర్ లో అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. మళ్లీ 1991లో మళ్లీ తాడ్వాయి మండలంలో విధుల్లో నిర్వహించారు. ప్రస్తుతం గుండెపోటుతో మృతి చెందే వరకు కాటాపూర్ సెక్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉన్నట్టుండి విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఒక రోజు ఈనెల నవంబర్ 29, 2024 నాడు గుండెపోటుతో కీర్తిశేషులు వజ్జ లక్ష్మీనర్సు మృతి చెందారు. ఆయన మృతితో అటు అటవీ శాఖలో, ఇటు ఆదివాసి గుడాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏజెన్సీ గ్రామాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. ఆయన అటవీ శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ అటవీ శాఖ ఉద్యోగులలో, పేద ప్రజలకు ఆపద్బాంధవుడు గా మేలిగాడు. అడవి బిడ్డలకు అండగా గిరిజనులకు అప్పన్న హస్తం స్ఫూర్తి నింపుతూ, అందరికీ కష్టాల్లో పాలుపంచుకున్నాడు. ఆశయం ముందు అలసట ఎరుగని వ్యక్తి కీర్తిశేషులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వజ్జ లక్ష్మీనర్సు. కీర్తిశేషులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వజ్జ లక్ష్మీనరసి, అతని భార్య  లక్ష్మి,  తాడ్వాయి ఆశ్రమ పాఠశాలలో హెచ్ డబ్ల్యు ఓ గా విధులు నిర్వహిస్తారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగంతో పాటు ఇద్దరు కలిసి సమాజానికి తమ వంతు సహాయం చేసేవారు. ఆయన మృతి అటవీ శాఖకు, ఆదివాసి లోకానికి తీరని లోటును తలపిస్తుంది. ఆయన గుండెపోటుతో మృతి చెందిన మరణ వార్త అటవీ శాఖ ఉద్యోగుల్లో, ఇటు ఏజెన్సీలో ఆదివాసిగూడలో కలకలం లేపింది.. ఆయన మృతి ఆదివాసీలోకానికి పేద ప్రజానీకానికి తీరని లోటు..