
మండలంలోని నారాయణగిరి గ్రామానికి చెందిన పేదల పాలిటి ఆపద్బాంధవుడు వల్లపు రెడ్డి రాంరెడ్డి. నారాయణగిరి గ్రామానికి చెందిన కనుగంటి భాస్కర్ అనారోగ్యానికి గురైన సందర్భంగా ఎన్ఆర్ఐ వల్లపు రెడ్డి రామ్ రెడ్డి, ముప్పారం ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్ ఆర్థిక సాయం చెరో రూ.5వేల చొప్పున పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంగళవారం ఆయనకు అందించారు. ఎస్ఎంసీ మాజీ ఛైర్మన్ కనుగంటి భాస్కర్ కు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నారాయణగిరి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ వల్లపురెడ్డి రాం రెడ్డి మానవతా దృక్పథంతో తోచిన సాయాన్ని అందించారు. ఆయనతో పాటు ముప్పారం గ్రామ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్ కూడా తనవంతుగా రూ.5వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో పిఎసిఎస్ డైరెక్టర్ మడి కంటి రాజయ్య, ఎంపిటిసి పెద్ది రమేష్, నారాయణగిరి మాజీ సర్పంచ్ బొగ్గుల వెంకటస్వామి, ముప్పారం మాజీ ఎంపీటీసీ మేకల విజయ్, మాజీ ఎస్ఎంసి చైర్మన్ కోతి సాంబరాజు, మాజీ సర్పంచ్ గై కృష్ణమూర్తి, వక్కల కరుణాకర్, కడియం యువసేన, రామన్న యువసేన అధ్యక్షుడు గంటే కృష్ణ తదితరులు పాల్గొన్నారు.