
నవతెలంగాణ-తొగుట
కరువు కాటకాలతో విలవిలలాడిన తెలంగాణ మాగాణిలో గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. మల్లన్న సాగర్ గోదావరి జలాల విడుదల సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ప్రాజెక్టు వద్ద గోదారమ్మకు పూలు, పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్ల సమైఖ్యాంధ్ర పాలనలో గోదావరి జలాలు సము ద్రం పాలయినా ఎవరూ పట్టించుకోలేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి వలం మూడున్నర ఏళ్లలో పూర్తి చేయడం జరిగిందన్నారు. నాడు ప్రాజెక్టు నిర్మిస్తుంటే అడు గడుగునా అడ్డుకున్న వారే నేడు హారతులు పడు తున్నారన్నారు. మేడిగడ్డ మీద చిన్న లోపం ఏర్పడితే మొత్తం ప్రాజెక్టు అవినీతి మయమని దుష్పచారం చేశారని, నేడు మల్లన్న సాగర్లో విడుదల అవుతున్న గోదావరి జలాలు చూసి సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ హాయాంలో వానాకాలంలో సైతం వాగు వంకలకు, చెరువు, కుంటలకు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నీటిని వదలడం జరిగిందని, నేడు నీటి విడుదల చేయకపోవడంతో రైతులకు సాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. గత ఏడాది మల్లన్న సాగర్లో 15 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయడం జరిగిందని, ఈ సంవత్సరం కూడా సామర్థ్యం మేర నీటిని నిల్వ చేసి రైతులకు సకాలంలో అందించాలని ఆయన కోరారు. సూర్యపేట సభలో కేసీఆర్, మేడిగడ్డ వద్ద కేటీఆర్ లు నీటిని డుదల చేయకపోతే 50 వేల మంది రైతులతో ముట్టడిస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం జరిగిందని, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటి విడుదల చేయాలని లేఖ కూడా వ్రాయడం జరిగిందని, రైతుల పక్షాన పోరాటం చేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిల్లీ వేధికగా హెచ్చరికలు చేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి మూ లంగానే ప్రభుత్వం తలొగ్గి నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. రైతులపై రాజకీయాలు చేయవద్దని, బేషజాలకు పోకుండా ప్రతి ఎకరాకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు చెరుకు లక్ష్మారెడ్డి, నాయకులు వెల్పుల స్వామి, రాజిరెడ్డి, స్వామి, శ్రీనివాస్, పిట్ల వెంకటయ్య, లక్ష్మారెడ్డి, సంతోష్ రెడ్డి , స్వామిగౌడ్, రమేష్ గౌడ్, పర్శరాములు, కరయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.