నవతెలంగాణ – కంఠేశ్వర్
విద్యార్థులకు చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు కూడా అవసరమని తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లి. చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల వసతిగృహ విద్యార్థులకు న్యూ అంబేద్కర్ భవన్ లో శనివారం నిర్వహించారు. ఈ జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు-2024 నిర్వహణలో భాగంగా బాలబాలికలకు వేరు వేరుగా జానపద, దేశభక్తి శాస్త్రీయ నృత్యపోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లి. చైర్మన్ మానాల మోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమమునకు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) యస్. కిరణ్ కుమార్ అధ్యక్షత వహించగా, జిల్లా వె.బ.త. అభివృద్ధి అధికారిణి బి. స్రవంతి, సహాయ వె.బ.త అధికారులు పి. నర్సయ్య, సి. గంగాధర్, బి.సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ సి.హెచ్. వెంకన్న తో పాటు అన్ని ప్రభుత్వ వె.బ.త. వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శన కనబరచిన వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ నెల 28, 29వ తేదిలలో బోధన్లో జరిగిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఉత్తమ క్రీడాకారులను ఈరోజు జరిగిన జానపద, దేశభక్తి, శాస్త్రీయ నృత్యపోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసామని జిల్లా వె.బ.త. అభివృద్ధి శాఖ అధికారులు తెలియజేశారు.