మహిళా సంఘాలను బలోపేతం చేస్తాం: ఏపీడీ

We will strengthen women's associations: APD– బ్యాంకు లింకెజీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి 
నవతెలంగాణ – పెద్దవంగర
జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తామని ఏపీడీ జయశ్రీ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నాబార్డ్ సహకారంతో, లక్ష్యం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న మిల్లెట్ ఆహార ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని డీపీఎం లు నళిని నారాయణ, చంద్రశేఖర్ తో కలిసి సందర్శించారు. వివిధ మిల్లెట్ తినుబండారాల తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘం సభ్యులకు బ్యాంకు లింకెజీ రుణాలను అందజేస్తాం అన్నారు. మిల్లెట్ ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. సోషల్ మాధ్యమాల్లో ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్ చేపట్టాలని సూచించారు. మహిళలందరూ స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం రమణాచారి, సీసీ లు జి సుధాకర్, పద్మ, సుజాత, బి. సుధాకర్, మార్కెటింగ్ అధికారి ఝాన్సీ, స్టాక్ నెంబర్ కీర్తన, వర్కర్స్ రమ, సునీత, రమాదేవి, శోభ తదితరులు పాల్గొన్నారు.