సర్వేను పరిశీలించిన ఏపిఎం చిన్నయ్య..

APM Chinnayya examined the survey.నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలోని కందకుర్తి, నీలా, సాటా పూర్, కూనేపల్లి, కిసాన్ తండా గ్రామాలలో మండల సూపర్వైజర్ ఏపీఎం చిన్నయ్య గురువారం పర్యటించారు. ఈ ఐదు గ్రామాలకు గాను 20 మంది ఎన్యూమినేటర్లతో 98 శాతం సర్వే ని పూర్తి చేయడం జరిగిందని, ఆయన పేర్కొన్నారు. ఐదు గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయడం జరిగిందని, అందుబాటులో లేని కొన్ని మాత్రం మిగిలిపోయాయని, రేపటికల్లా 100% పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించడం జరిగిందన్నారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా సర్వే నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించడం జరిగిందన్నారు.