ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: ఏపిఎం చిన్నయ్య

నవతెలంగాణ – రెంజల్

ఆరుగలం కష్టం నుంచి పండించిన  పంట ను దళారులకు విక్రయించి మోసపోకుండా ప్రభుత్వం దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎ చిన్నయ్య పుష్పాష్టం చేశారు. రెంజల్ మండలంలోని బోర్గం, అంబేద్కర్ నగర్, గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కొనుగోలు కేంద్రాల్లోని రైతులు తాము పండించిన పంటను విక్రయించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు లక్ష్మీ, కార్యదర్శి మాధవి, సీసీలు కృష్ణ, శ్యామల, సునీత, రాజయ్య, గ్రామ సంగం అధ్యక్షులు సవిత, స్వరూప, గంగు భాయ్, ప్రమీల, రైతులు మేత్రి రాజు, రాము, నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.