నవతెలంగాణ – రెంజల్
జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ డిఆర్డిఏ ఆధ్వర్యంలో రెంజల్ మండలంలో మహిళా శక్తి టైలరింగ్ సెంటర్లను శుక్రవారం ఏపీఎం చిన్నయ్య, మండల సమైక్య అధ్యక్షురాలు లక్ష్మీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించాలన్న తలంపుతో సేర్ఫ్ ఆధ్వర్యంలో మండలంలోని రెంజల్, దూపల్లి, నీలా, సాటాపూర్, దండిగుట్ట గ్రామాలలో కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. మండలంలోనీ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6,842 మంది విద్యార్థిని, విద్యార్థులకు గాను,7553.5 మీటర్ల క్లాత్ ను ఇవ్వడం జరిగిందని, వీటితో మహిళ శక్తి టైలరింగ్ సెంటర్ల ద్వారా వారికి ఏకరూప దుస్తులు తయారు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు లక్ష్మి, ప్రధాన కార్యదర్శి మాధవి, కోశాధికారి గంగమని, సీసీలు భాస్కర్, సునీత, రాజయ్య, శివకుమార్, శ్యామల ,కృష్ణ, గ్రామ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.