నవతెలంగాణ – మద్నూర్
ఈ నెల 31న శుక్రవారం ఉదయం 11 గంటలకు మద్నూర్ మండల కేంద్రంలోని మండల మహిళా సమైక్య కార్యాలయంలో వివో ఏలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల ఏపిఎం రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ తరగతులు పిల్లలకు పోషకాహారం లోపం నివారణ గురించి ఉంటుందని, ఆయన తెలిపారు. ఈ శిక్షణకు మండలంలోని వివోఏలు అందరూ తప్పక హాజరు కావాలని కోరారు.