సంఘాల్లో లేని వారిని సంఘంలో చేర్పించాలి: ఎపిఎం సూవర్ణ

Those who are not in the communities should be included in the community: APM Suwarnaనవతెలంగాణ  డిచ్ పల్లి
మహిళా సంఘంలో లేనివారిని సంఘాలలో చేర్పించే విధంగా ప్రత్యేక చొరవ చూపాలని ఈనెల 14 నుండి డిసెంబర్ 9 వరకు జరిగే ఇంద్ర శక్తి మహోత్సవాలు విజయవంతం చేయాలని ఏపీఎం సూవర్ణ పేర్కొన్నారు.సోమవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని మండల సమైక్య కార్యాలయంలో ప్రత్యేక మండల సమైక్య సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల నుండి తీసి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏపిఎం సూవర్ణ మాట్లాడుతూ సంఘంలో లేని మహిళలను సంఘంలో చేర్పించాలని, ప్రతి గ్రామంలో ఉన్న వికలాంగులను  గుర్తించి వారిని సంఘాలుగా చేయాలని,మహిళ లకు ప్రమాద భీమా కింద 10 లక్షల ఇన్స్యూరెన్స్, లోన్ భీమా, సురక్ష భీమా,మహిళ శక్తి క్యాంటీన్ ఏర్పాటు,మహిళకు సోలార్, నటు కోళ్ల పెంపకం, పాల ఉత్పత్తిలో  తయారు చేసే వస్తువులు,పాడి గేదెలు ,పిండి గిర్ని, ఎంటర్ ప్రైజస్,బ్యాంక్ లింకేజ్,స్త్రీ నిధి రుణాలు,వడ్డీ లేని రుణాలు అందజేసే విధంగా మహిళ సంఘాల సభ్యులకు ప్రభుత్వం కల్పిస్తుందని వివరించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, యూనిఫాం ల తయారీ డ్వాక్రా బజార్ ఏర్పాటు, మండల మహిళా సమాఖ్య భవనాలు, జిల్లా సమైక్య భవనాల నిర్మాణం, మహిళా క్యాంటీన్ ఏర్పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ కార్యక్రమం పై ఈ సమావేశంలో చర్చించారు ఈ సమావేశం మండల సమైక్య అధ్యక్షురాలు సుజాత అధ్యక్షతన ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో సీసీల ఉదయ్, అనురాధ,గోవింద్ తోపాటు ఆయా గ్రామాల మహిళా సమాఖ్య అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.