ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఏపీఓ గిరి హరీష్.

నవతెలంగాణ –  మల్హర్ రావు
కూలీలు ఉపాధిహామీ పథకాన్ని వినియోగించుకోవాలని మండల ఉపాది ఏపీఓ హరీష్ కూలీలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని మిర్చి తోటల వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు వంద రోజులు పని చేయాలని, ఒక రోజుకు దినసరి వేతనం రూ.272 చొప్పున 100 రోజులకు రీ.27,200 పొందాలని వివరించారు.ఈ కార్యక్రమంలో టెక్నిక్ అసిస్టెంట్ రేగ శేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ మెడగాని రాజయ్య పాల్గొన్నారు .