నర్సరీని కేంద్రాన్ని పరిశీలించిన ఏపీవో

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని వంగ రామయ్య పల్లి గ్రామంలోని నర్సరీ కేంద్రాన్ని శుక్రవారం ఏపీవో పద్మ , సర్పంచ్ విజయలక్ష్మి తో కలిసి పరిశీలించారు. గ్రామంలో వర్షాలు పడటంతో మొక్కలు నాటేదుకు ప్రణాళిక సిద్ధం చేశారు. నర్సరీ కేంద్రంలో 11వేల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వంగ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి జ్యోతి తదితరులు పాల్గొన్నారు..