
మండలంలోని బేగంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కూలీలు చేస్తున్న పనులను మండల ఏపీఓ మంగళవారం నాడు పరిశీలించారు. అనంతరం ఆయన కూలీలనలను పలు సూచనలు చేస్తూ కూలీలు ప్రతి రోజు కొలత ప్రకారం పనులు చేస్తే ప్రతి ఒక్క కూలికి 250 రూపాయల వరకు కూలి పడుతుందని తెలిపారు. అదేవిధంగా కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తేనే వారిని హాజరు పట్టికలో హాజరు వెయ్యలని రాని వారి హాజరు వెయ్యారాదని పిల్డ్ అసిస్టెంట్లు ను ఆదేశించారు.