హైదరాబాద్ : ఎలక్ట్రో మెకానికల్ సొల్యూషన్స్ డిజైన్ రంగంలోని అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ కొత్తగా ఇంజీనియస్ డిఫెన్స్ సిస్టమ్స్ (ఐపిఐడిఎస్) కోసం ఇంటిగ్రేటెడ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోని హార్డ్‌వేర్ పార్క్‌లో ఇప్పటికే కేటాయించిన 2.5 ఎకరాల భూమికి ప్రక్కనే ఉన్న అదనంగా 2.5 ఎకరాల భూమి కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని పేర్కొంది. ఐదు ఎకరాల భూమిలో ఐపిఐడిఎస్ స్థాపనకు వినియోగించ బడుతుందని పేర్కొంది. ఇందుకోసం రూ.210 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించింది.