– మేడే రాజీవ్ సాగర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేదని ఆయన విమర్సించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు అలంకరణ చేయలేదని ప్రశ్నించారు. గతంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగేవని తెలిపారు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ సారి ఎలాంటి కమిటీ వేయకుండా ఉత్సవాలు నిర్వహించలేదని తెలిపారు.