టీపీసీసీ అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి రావాలని విజ్ఞప్తి

నవతెలంగాణ – కంటేశ్వర్
నూతనంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు గా నియమింపబడిన మహేష్ కుమార్ గౌడ్ సెప్టెంబర్ 15 వ తేదీన మధ్యాహ్నం 2:00 గంటలకు హైదరాబాద్ లోని గాంధీ భవన్ నందు భాద్యతలు స్వీకరించడం జరుగుతుంది అని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆదివారం తెలియజేశారు. కావున జిల్లా వాస్తవ్యుడు మహేష్ కుమార్ గౌడ్ యొ్క ప్రమాణ స్వీకారానికి జిల్లా నుండి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.