టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ , బల్మూర్ వెంకట్ లకు వినతి

– టీపీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ కన్వీనర్ తూళ్ళ ప్రణయ్
నవతెలంగాణ – నెల్లికుదురు
హైదరాబాద్ గాంధీ భవన్ లో శాసనమండలి సభ్యులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  శ్రీ మహేష్ కుమార్ గౌడ్  ని బల్మూర్ వెంకట్ లను  మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి , నాకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా  అవకాశం కల్పించి నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించవలసింది అని టీపీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ కన్వీనర్ తోళ్ల ప్రణయ్ విన్నవించినట్లు తెలిపారు.  ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ కన్వీనర్ తొల ప్రణయ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించామని అన్నారు.  పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని స్వీకరించి ఎన్ని ఇబ్బందులు అవరోధాలు ఆటంకాలు ఎదురైనా నిలబడ్డానని, అప్పటి అధికారపక్షం ఎన్ని ఇబ్బందులు గురిచేసిన పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా పనిచేశానని తెలిపారు. కొన్ని ఏళ్ల నుండి పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని నిలబడ్డామని తెలిపారు. కష్ట కాలంలో కూడా పార్టీని పట్టుకొని కార్యకర్తలను కాపాడుకున్నామని అన్నారు. అటువంటి తనకు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుందని నమ్మకం ఉందని  ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాగే శాసనమండలి సభ్యులు స్పందించి తప్పకుండా నా అభిప్రాయాన్ని పరిగణంలోకి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.